శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

లోకం చుట్టిన వీరుడు - మెగాలెన్ కథ

Posted by శ్రీనివాస చక్రవర్తి Saturday, May 28, 2011 0 comments

లోకం చుట్టిన వీరుడు - మెగాలెన్ కథ
(కొలంబస్, వాస్కో ద గామా, మెగాలెన్ ల లోకపర్యటనా వృత్తాంతం ధారావాహికంగా...)

http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-599

లోకం చుట్టూ రైలు ప్రయాణం

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, May 24, 2011 0 comments

http://www.andhrabhoomi.net/intelligent/lokam-884

ఫెయిన్మన్ చేసిన రేడియో మేజిక్

Posted by శ్రీనివాస చక్రవర్తి Saturday, May 21, 2011 0 comments

http://www.andhrabhoomi.net/sisindri/radio-magic-477

గణిత లోకపు యువరాజు గౌస్

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, May 18, 2011 0 comments

http://www.andhrabhoomi.net/sisindri/ganitham-274

కర్డషేవ్ ఊహించిన మానవ భవితవ్యం - (రెండవ భాగం)

Posted by శ్రీనివాస చక్రవర్తి Monday, May 16, 2011 3 commentshttp://www.andhrabhoomi.net/intelligent/k-648


కర్డషేవ్ ఊహించిన నాగరికతలు 0, 1, 2, 3 రకం నాగరికతలుగా వర్గీకరించబడ్డాయని క్రిందటి వారం వ్యాసంలో చెప్పుకున్నాం. నాగరికతల లోని ఈ స్థాయి ఆ నాగరికత యొక్క శక్తివినియోగం మీద ఆధారపడుతుంది. ప్రస్తుతం మనం ఉన్న నాగరికత యొక్క శక్తి వినియోగం సాధ్యమైన భావి నాగరికతలతో పోల్చితే అంత ఎక్కువ కాదు గనుక మన నాగరికతని 0 రకం నాగరికతగా కర్డషేవ్ వర్గీకరిస్తాడు. శక్తి వినియోగం లోని ఆధిక్యతని సంఖ్యాత్మకంగా వ్యక్తం చెయ్యడానికి కర్డషేవ్ ఒక కొలమానాన్ని ప్రతిపాదించాడు. దీన్ని 'కర్డషేవ్ స్థాయి' (Kardashev scale) అంటారు. ఈ స్థాయి 0 తో మొదలై 4 వరకు పోవచ్చు. ఒక నాగరికత యొక్క శక్తి వినియోగంలో కొన్ని మైలురాళ్లని కర్షషేవ్ పేర్కొంటాడు. ఒక్కొక్క మైలురాయిని దాటుకుంటూ మానవనాగరికత మరింత ఉన్నత రకం నాగరికతగా పరిణామం చెందుతుంటుంది.

ఒక గ్రహం మీద సాధ్యమైన గరిష్ఠ శక్తివినియోగ స్థాయిని చేరుకున్న నాగరికత 1 వ రకం నాగరికత స్థాయికి ఎదుగుతుంది. మన భూమినే తీసుకుంటే ఆ సాధ్యమైన గరిష్ఠ శక్తి వినియోగ స్థాయి 1.74 X 10^17 watts అని చెప్పుకుంటారు. ఇది భూమి మీద పడే మొత్తం సౌరశక్తి విలువ. మనం వినియోగించే శక్తి వనరులలో అధిక శాతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సూర్యుడి మీద ఆధారపడ్డవే కనుక భూమి మీద ప్రసారమయ్యే మొత్తం సౌరశక్తి విలువని ఆ గరిష్ఠవిలువగా తీసుకున్నారు. ప్రస్తుతం భూమి మీద మన మొత్తం శక్తి వినియోగం 10^12 watts దరిదాపుల్లో ఉంటుంది. కనుక ప్రస్తుత నాగరికత యొక్క కర్డషేవ్ స్థాయి 0.71 గా శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు.

మన శక్తి వినియోగం 1.74 X 10^17 watts చేరుకున్నప్పుడు మన నాగరికత కర్డషేవ్ స్థాయి 1 ని చేరుకుంటుంది. ప్రస్తుతం భూమి మీద మన శక్తి వినియోగం పెరుగుతున్న వేగం బట్టి ఆ స్థాయిని మనం మరో 100 ఏళ్లలో చేరుకుంటామని నిపుణుల నమ్మకం. ఆ దశలో ఇక మనం భూమి మీద పడే సౌరశక్తిలో అధిక భాగాన్ని గ్రహించి మానవవ్యవహారాలలో వినియోగించుకుంటాం అన్నమాట.

తీవ్రవిభజనలతో సంక్షోభంగా ఉండే 0 రకం నాగరికత క్రమంగా తన అంతరంగ సంఘర్షణలని పరిష్కరించుకుంటూ ఏకత్వం దిక్కుగా వికాసం చెందుతుంది. అలాంటి ఏకీకరణకి చక్కని తార్కాణాలు గత శతాబ్దంలో ఏర్పడ్డ ఐక్యరాజ్యసమితి మొదలైన అంతర్జాతీయ వ్యవస్థలే. మానవ జాతి యొక్క వికాసక్రమంలో ఏదో దశలో ఇలాంటి సమైక్యత ఏర్పడవలసిందే. వైవిధ్యం మానవ సహజం కావచ్చు కాని, విభేదం, విభజన, మానవ సమాజాల సుదీర్ఘవృధ్ధికి హానికరం. అలాంటి సమైక్యతకి, సామరస్య జీవనానికి దొహదం చేసే రాజకీయ వ్యవస్థని ఏర్పరచుకుంటూ, శక్తి వనరుల వినియోగాన్ని క్రమంగా పెంచుకుంటూ 1 వ రకం నాగరికత పురోగమిస్తుంది.

ఇలాంటి పురోగమన క్రమంలో ఒక దశలో, ఇక గ్రహం మీద హరించడానికి పెద్దగా శక్తి వనరులు మిగలని దశలో, గ్రహాన్ని వొదిలి గ్రహానికి బయట అంతరిక్షంలో గాని, ఇతర గ్రహాల మీద గాని, లభ్యమయ్యే శక్తివనరుల కోసం ఆ జాతి అన్వేషణ మొదలెడుతుంది. ఏ తారా వ్యవస్థలో అయినా, గ్రహాల మీద కన్నా ఆ గ్రహాలు ప్రదక్షిణ చేస్తున్న తారలోనే అధిక శాతం శక్తి వనరులు ఉంటాయి. కనుక ఆ తార నుండి వెలువడే మొత్తం శక్తిని గ్రహించి వినియోగించగల నాగరికత 2 రకం నాగరికతగా ఎదుగుతుంది.

మరి సూర్యుడి నుండి వచ్చే కాంతిలో అతి చిన్న భాగం మాత్రమే భూమి మీద పడుతుంది. మరి సూర్యుడి నుండి వెలువడే మొత్తం కాంతి శక్తిని గ్రహించేదెలా? అందుకు ఫ్రీమాన్ డైసన్ అనే ఖగోళశాస్త్రవేత్త ఓ బ్రహాండమైన ఆలోచనని ప్రతిపాదించాడు. తన ఊహాగానం ప్రకారం సూర్యుడి చుట్టూ సుమారు 150 మిలియన్ కిమీ.ల దూరంలో పెద్ద సంఖ్యలో సౌర శక్తిని సౌరఫలకాల సహాయంతో గ్రహించే ఉపగ్రహాలు కక్ష్యలో తిరుగుతుంటాయి. ఒక్కొక్క ఉపగ్రహం యొక్క వ్యాసం 10^7 కిమీలు (ఇది భూమికి చంద్రుడికి మధ్య ఉన్నంత దూరం) ఉంటుంది. ఇలాంటి ఊహాతీతమైన ఉపగ్రహాల మహావలయాన్ని 'డైసన్ వలయం' (Dyson ring) అంటారు (కింది చిత్రం). ఈ స్థాయిలో పితృ తార నుండి శక్తిని రాబట్టే సాంకేతిక సత్తా ఉన్న నాగరికత 2 వ రకం నాగరికతగా పరిణమిస్తుంది. ఈ దశలో దాని శక్తి వినియోగం 4 X 10^26 watts ఉండొచ్చని కర్డషేవ్ విశ్లేషణ చెప్తుంది.

కాని ఏదో ఒక దశలో అలా బృహత్ స్థాయిలో జరిగే శక్తి వినియోగం కూడా పెరుగుతున్న నాగరిక అవసరాలకి సరిపడకపోవచ్చు. పితృతార నుండి వచ్చే శక్తిలో అధిక భాగం వాడుకుంటున్నా ఇంకా ఇంధనం కోసం ఆకలి తీరకపోవచ్చు. అలాంటి నాగరికత తన పితృతారకి చెందిన తారావ్యవస్థని వదిలి ఇతర తారావ్యవస్థలలో శక్తి వనరుల కోసం వేట మొదలుపెడుతుంది. ఇతర తారల పరిసరాలలో నివాసయోగ్యమైన గ్రహాలని కనుక్కుని అక్కడ నివాసాలు ఏర్పరుచుకుంటుంది. అలా ఒక గ్రహం మీద ఆవిర్భవించిన జాతి, క్రమంగా ఇతర తారావ్యవస్థలకి వ్యాపించి గెలాక్సీ మొత్తం విస్తరించిన ఓ అద్భుత మహాసామ్రాజ్యాన్ని స్థాపించే పరిణామాన్ని ఎంతో మంది ఊహించారు. కర్డషేవ్ విశ్లేషణ ప్రకారం అలాంటి నగరికత యొక్క శక్తివినియోగం రమారమి 10^37 watts ఉండొచ్చు. అలాంటి బ్రహ్మాండమైన నాగరికత అసిమోవ్ ఫౌండేషన్ నవలామాలికలో వర్ణించబడుతుంది. అయితే వాస్తవంలో మన ప్రస్తుత నాగరికత ఆ దిశలో పరిణామం చెందుతుందా, చెందితే ఆ స్థితిని చేరుకోడానికి ఎన్ని సహస్రాబ్దాలు, ఎన్ని లక్షల ఏళ్లు పడుతుంది? మొదలైన ప్రశ్నలకి కచ్చితమైన సమాధానాలు ప్రస్తుతం లేవు.

కర్డషేవ్ ఊహించిన మానవ భవితవ్యం

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, May 11, 2011 0 comments

మొన్న సోమవారం ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం...

http://www.andhrabhoomi.net/intelligent/kard-206

ప్లూటోకి పేరు పెట్టిన పాప

Posted by శ్రీనివాస చక్రవర్తి Saturday, May 7, 2011 1 comments

ఈ రోజు ఆంధ్రభూమిలో అచ్చయిన ఓ "బాల" వ్యాసం -

http://www.andhrabhoomi.net/sisindri/pluto-752

నీటిపై తేలే వంతెనలు

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, May 3, 2011 0 comments


ఈ సోమవారం ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం


http://www.andhrabhoomi.net/intelligent/netipai-810
వంతెనలకి పడవలకి మధ్య ఒక పోలిక ఉంది. పడవల లాగానే వంతెనలు కూడా తరచు మనుషులని ఒక తీరం నుండి మరో తీరానికి చేర్చుతాయి. కాని తేడా ఎక్కడొస్తుందంటే పడవలు నీటి మీద తేలుతాయి, కదులుతాయి. వంతెనలు నేల మీద నిశ్చలంగా నిలబడతాయి. అయితే కొన్ని వంతెనలు కదలకపోయినా నీటి మీద తేలుతుంటాయి. వీటినే తేలే వంతెనలు (floating bridges లేక pontoon bridges) అంటుంటారు.

ఒక విధంగా చరిత్రలో మొట్టమొదటి తేలే వంతెన మనకి రామాయణంలో ఎదురవుతుంది. రాళ్ల మీద ‘శ్రీరామ’ అని రాసి సముద్రంలో పడేస్తే ఆ రాళ్లు తేలాయని, ఆ తేలే రాళ్ల మీదుగా వంతెన కట్టి వానరులు లంకను చేరారని ఆ ఇతిహాసం చెప్తుంది. ప్రాచీన చైనాలో కూడా తేలే వంతెనలు ఉన్నట్టు ఆ దేశపు చరిత్ర చెప్తుంది. జౌ వంశానికి చెందిన ‘వెన్’ అనే రాజు క్రీ.పూ. పదకొండవ శతాబ్దంలో ఆ దేశపు మొట్టమొదటి తేలే వంతెనని నిర్మించాడని, ‘పడవలని కలిపి, వంతెన కట్టి’ నది దాటాడని చారిత్రక వృత్తాంతాలు ఉన్నాయి. క్రీ.శ. 25–220 లో తూర్పు హన్ వంశపు రాజుల కాలంలో విశాలమైన పసుపు నది (Yellow river) మీదుగా ఓ పెద్ద తేలే వంతెన నిర్మించబడింది. అలాంటిదే మరో మహా వంతెన 1372 లో చైనాలో ‘లాంజ్హౌ’ ప్రాంతంలో నిర్మించబడింది. 1420 లో చైనాని సందర్శించడానికి వచ్చిన గియాసుద్దీన్ నక్కా అనే ఓ పర్షియన్ దూత ఆ వంతెనని ఇలా వర్ణిస్తాడు – “ఇరవై మూడు నాణ్యమైన, ధృఢమైన పడవలని మనిషి తొడలంత మందమైన ఇనుప గొలుసులతో కలిపి కట్టారు. ఆ ఇనుప గొలుసులని వంతెనకి ఇరుపక్కలా నేలలో పాతిన, మనిషి నడుమంత మందమైన ఇనుప స్తంభాలకి కట్టారు. పడవల మీద చెక్క పలకలు ఏర్పటు చేసి బాటగా వేశారు. దాని మీదుగా జంతువులు సునాయాసంగా దాటగలిగేవి.”


లోతు మరీ ఎక్కువై, నీటి అడుగు వరకు స్తంభాలు నిర్మించడానికి పట్టే ఖర్చు మరీ ఎక్కువైన సందర్భాలలో గాని, స్వల్పకాలంలో తాత్కాలిక ప్రయోజనాల కోసం వంతెన నిర్మించాల్సిన సందర్భాలలో గాని ఈ తేలే వంతెనలు అవసరమవుతాయి. ఇందులో నీటి మీద తేలే పాంటూన్లు అనబడే వస్తువులు వంతెన భారాన్ని, వంతెన మీద వాహనాల భారాన్ని మోస్తాయి. ఈ పాంటూన్లని ఒకదాంతో ఒకటి స్థిరంగా బంధించాలి. అంతేకాక ఆ పాంటూన్ల సమూహం నీటి మీద కదలకుండా లంగరు వేసి, వాటిని నీటి అడుక్కో, తీరానికో బంధించాలి. సామాన్యంగా ఒక ఒడ్డు నుండి బయలుదేరి, పాంటూన్లని వరుసగా గొలుసుకట్టులా అమర్చుకుంటూ, అవతలి తీరం దాకా క్రమంగా వంతెనని విస్తరింపజేసుకుంటూ పోతారు.

యుద్ధ సమయంలో అతి తక్కువ సమయంలో చిన్న చిన్న నదుల మీదుగా వంతెనలు నిర్మించాలల్సి వచ్చినప్పుడు తేలే వంతెనలే శరణ్యం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని తేలే వంతెనలు నిర్మించబడ్డాయి. ఇటీవలి కాలంలో 1990 లలో బాస్నియాలో జరిగిన యుద్ధంలో నేటో దేశాలకి చెందిన శాంతిస్థాపక సేనలు ఒక చోట సావా అనే నదిని దాటవలసి వచ్చింది. నది పోటెక్కి నీరు బురద మయమై ఉంది. మామూలు వంతెన నిర్మించడానికి కావలసిన వ్యవధిగాని, అనువైన పరిస్థితులు గాని లేవు. పైగా యుద్ధంలో ఎన్నో వంతెనలు ధ్వంసం అయిపోయాయి. ఇక తేలే వంతెన తప్ప వేరే మార్గాంతరం లేదు. స్టీలు, అల్యూమినమ్ ల తో చేసిన తేలే నిర్మాణాలని హెలికాప్టర్లలో తెచ్చి నీటి మీద పడేశారు. మోటారు పడవల సహాయంతో వాటిని తోసుకుంటూ ఒక వరుస క్రమంలో అమర్చారు. అలా 85 పాంటూన్లని అమర్చి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నిర్మించబడ్డ అతి పెద్ద తేలే వంతెనని నిర్మించారు. దాని మీద సేనలు సునాయాసంగా నదిని దాటగలిగాయి. విశేషం ఏంటంటే పాడైపోయిన ట్యాంకులని లాక్కెళ్లే, 88 టన్నుల బరువున్న, ఓ పెద్ద యుద్ధ వాహనం కూడా ఆ వంతెన మీద సురక్షితంగా నదిని దాటగలిగింది. వంతెన కొద్దిగా మూలిగింది గాని మునిగిపోలేదు.

మామూలు వంతెన విషయంలో బరువు మరీ ఎక్కువైతే వంతెన కూలిపోతుంది. కాని తేలే వంతెన విషయం వేరు. ఒక్కొక్క పాంటూను కొంత గరిష్ఠ బరువు మొయ్యగలదు. బరువు అంతకన్నా ఎక్కువైతే వంతెన మునిగిపోతుంది. ముఖ్యంగా తుఫానులు, ఉప్పెనలు ఈ తేలే వంతెనల సత్తాకి సవాళ్లుగా దాపురిస్తాయి. తుఫాను చేసిన విలయకాండకి మనుషుల నిర్లక్ష్యం తోడై 1990 లో అమెరికా లోని ‘మెర్సర్ ఐలాండ్ తేలే వంతెన’ని నీట ముంచింది. తుఫాను వచ్చిన నాటికి ముందే వరుసగా వచ్చిన కొన్ని సెలవు రోజుల్లో పొరపాట్న అక్కడి పనివారు పాంటూన్ల తలుపులు తెరిచి ఉంచి వెళ్లిపోయారు. తుఫాను సమయంలో ఆ పాంటూన్లలో నీరు ప్రవేశించడం వల్ల అవి మునిగిపోసాగాయి. మునుగుతున్న పాంటూన్లు ఇతర పాంటూన్లని కూడా జలగర్భంలోకి ఈడ్చుకెళ్లాయి.కనుక తేలే వంతెనల నిర్మాణం అంత తేలికైన విషయం ఏమీ కాదు. పెద్ద పెద్ద కెరటాలు లేచే జలప్రాంతాల మీద తేలే వంతెనల నిర్మాణంలో ప్రత్యేక కొత్త సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సందర్భంలో అతి తక్కువ ఎత్తున్న కెరటం కన్నా లోతుగా పాంటూన్లని నీట్లో నిలుపుతారు. అలాంటి పాంటూన్ల మీద వంతెన నిలుస్తుంది. వంతెన మాత్రం అతి పెద్ద కెరటం కన్నా ఎత్తున ఉండేలా నిర్మిస్తారు. అలాగే నదీ ప్రవాహం మరీ ఉధృతంగా ఉండే పరిస్థితుల్లో తేలే వంతెన నిర్మాణంలో కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకి ఆస్ట్రేలియాలో డెర్వెంట్ నది మీద నీటి మీద తేలే చాపం (arch) ఆకారంలో ఓ తేలే వంతెనని నిర్మించారు. నిటారుగా నిలబడే చాపం గురుత్వం వల్ల ధృఢం అయినట్టు, ఈ చాపం ఆకారం గల తేలే వంతెన నీటి ప్రవాహం వల్ల మరింత ధృఢతరం అవుతుంది.


వెడల్పు, లోతు మరీ ఎక్కువైన జలమార్గాల ‘తారక’ మంత్రం తేలే వంతెనే అవుతుంది. సాంప్రదాయక వంతెనల నిర్మాణం దుస్సాధ్యం అయిన కొన్ని జలసంధుల (straits) మీద ఏనాటికైనా తేలే వంతెనలు నిర్మించాలని ఊహాగానం, చర్చ కొంత కాలంగా సాగుతోంది. కెనడాలోని జార్జియా జలసంధి (వెడల్పు 18.5 - 55 కి.మీ.లు), మధ్యధరా సముద్రానికి ముఖద్వారమైన జిబ్రాల్టర్ జలసంధి (వెడల్పు 14.3 కి.మీ.లు) మొదలైన జలాశయాల మీద బృహత్తరమైన తేలే వంతెనలు నిర్మించగలిగిన నాడు మన సివిల్ ఇంజినీరింగ్ పరిజ్ఞానం ఓ కొత్త ఎత్తును చేరుకున్నట్టు అవుతుంది.


1. ఇంట్లో ‘పవర్ ఫాక్టర్ ఆప్టిమైజర్’ ని ఇన్స్టాల్ చేసుకోండి. దీని వల్ల మోటార్ల పనికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. వాటి ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.
2. ఉతికిన బట్టలని డ్రయర్ లో కాక ఎండలో ఆరేయండి.
3. చల్లనీటిలో బట్టలు ఉతకండి. నీరు పిండిన బట్టలని ఆరుబయట ఆరేయండి. బయట ఎండగా ఉన్నా బట్టలని డ్రయర్ లో ఎండబెట్టకండి.
4. స్నానానికి వీలైనంతవరకు చన్నీళ్ళే వాడండి. ఆ విధంగా శక్తి, నీరు రెండూ ఆదా అవుతాయి.
5. ఇన్కాండెసెంట్ బల్బులని తొలగించి ‘కాంపాక్ట్ ఫ్లోరెసెంట్ లైట్ (CFL) బల్బ్’లని గాని, ‘లైట్ ఎమిటింగ్ డయోడ్ల’ని (LEDs) గాని వాడండి. ఒక్క ఇన్కాండెసెంట్ బల్బుని మార్చితే దాని జీవిత కాలంలో 150 పౌన్ల కార్బన్ ఆదా అవుతుంది. ఈ కొత్త రకం బల్బులు, ఇన్కాండెసెంట్ బల్బుల కన్నా 8-15 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి, కనుక మొత్తం జీవితకాలంలో సుమారు Rs. 1500 ఆదా చేస్తాయి. అయితే CFL రకం బల్బులలో కాస్తంత పాదరసం ఉంటుంది. కనుక వాటిని పారేసేటప్పుడు ‘ప్రమాదకర వ్యర్థం’గా జమకట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. LED లు కూడా చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. ఇన్కాండెసెంట్ లైట్లకి మల్లె ఇవి కూడా మెత్తని తెల్లని కాంతిని వెలువరిస్తాయి. వాటిలో పాదరసం ఉండదు గాని అవి CFL బల్బుల కన్నా ఆరు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. దీని వల్ల విద్యుత్ చార్జీలు తగ్గుతాయి.
6. మైక్రోవేవ్ పరికరాలని మరింతగా వాడాలి. మామూలు గ్యాస్ పొయ్యిల కన్నా, ఓవెన్ ల కన్నా మైక్రోవేవ్ పొయ్యిలు మరింత తక్కువ శక్తిని వాడుతాయి. ముఖ్యంగా నీరు వేడి చేసినప్పుడు శక్తి ఆదా గణనీయంగా కనిపిస్తుంది.
7. ఇంట్లో లైట్ల అవసరం లేకపోతే అది కాసేపే అయినా కూడా లైట్లు ఆపేయండి.
8. నెలకి ఒకసారి అయినా ఏ.సీ. లలో ఫిల్టర్లని శుభ్రం చెయ్యండి, లేదా మార్చేయండి.
9. ఫ్రిడ్జిలో ఉష్ణోగ్రతని 36-38 డిగ్రీల వద్ద, లోపల ఫ్రీజర్ లో ఉష్ణోగ్రతని 0-5 డిగ్రీల వద్ద సెట్ చెయ్యండి. ఫ్రిడ్జ్ లో గాలి పరిమాణం అతి తక్కువగా ఉండేలా, నిండుగా వస్తువులని సర్దండి.
10. పళ్లు తోముకుంటున్నప్పుడు కొళాయి కట్టేయండి. దీని వల్ల నెలకి 25 గాలన్ల నీరు ఆదా అవుతుంది.
11. టాయిలెట్ లో వాడే ట్యాంకులో నీటి మోతాదు తగ్గించుకోండి. టాయిలెట్ టాంకులో నీరు నింపిన లీటర్ బాటిల్ పెడితే నెలకి 300 గాలన్ల నీరు ఆదా అవుతుంది.
12. స్నానానికి ప్రవాహం తక్కువగా ఉండే షవర్లని వాడండి. అలాగే కొళాయిలో ఎయిరేటర్లు (faucet aerators) వాడి నీరు ఆదా చెయ్యండి.
13. ఎండాకాలానికి, చలికాలానికి మధ్య ఇంట్లో వాడే సీలింగ్ ఫాన్ల రెక్కలని తిరగతిప్పండి.
14. వాడేసిన ఫర్నీచర్ కొనుక్కోండి. ఇవి కొత్త ఫర్నీచర్ కన్నా చవకగా ఉంటాయి. (పురతన ఫర్నీచర్ (antique furniture) ఇందుకు మినహాయింపు). పాత ఫర్నీచర్ ని పారేయకుండా వాడడం వల్ల వ్యర్థాలు తక్కువ అవుతాయి.
15. కాగితపు నాప్కిన్ల కన్నా బట్ట నాప్కిన్లు వాడండి. ఆ బట్టని శుభ్రం చెయ్యడానికి నీరు అవసరమైనా ఈ పద్ధతే మేలు.
16. ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు ఎలక్ట్రానిక్ ఉపకరణాలని కేవలం ఆఫ్ చెయ్యడమే కాక ప్లగ్గు తీసేయండి. ఆఫ్ చేయబడి ఉన్న స్థితిలో కూడా ఈ పరికరాలు కొంత శక్తిని వాడుతాయి. సామాన్యంగా ఇళ్లలో 10% శక్తి వినియోగం ఈ విధంగా జరుగుతుంది.
17. ఒకే సారి ఎన్నో పరికరాల ప్లగ్గు తీసే సౌకర్యం కావాలంటే ‘సర్జ్ ప్రొటెక్టర్’ వాడండి.
18. వాడుకలో లేనప్పుడు కంప్యూటర్ని షట్ డవున్ చెయ్యండి.
19. పర్యావరణానికి మేలు చేసే కార్యక్రమాలని చేపట్టమని మీ స్థానిక అధికారులని ప్రోత్సహించండి.
20. శక్తిని సద్వినియోగం చేసే పద్ధతుల గురించి మీ స్నేహితులతో, ఇరుగుపపొరుగు వారితో, సహోద్యోగులతో పంచుకోండి.
21. అంగడికి వెళ్లినప్పుడు బట్టసంచీలని తీసుకెళ్లండి, ప్లాస్టిక్ సంచీలు, కాగితం సంచీలు వాడకండి.
22. సహజ పదార్థాల నుండి చేసిన ఉత్పత్తులని వాడండి.
23. దూరాల నుండి రవాణా చెయ్యబడ్డ సరుకుల కన్నా స్థానికంగా చెయ్యబడ్డ సరుకులనే వాడడానికి ప్రయత్నించండి
24. కాపీ చేసి, ప్రింట్ చేసే అవసరాలని తగ్గించుకోండి. తప్పనిసరిగా అవసరమైన పరిస్థితుల్లో కాగితానికి రెండు పక్కలా వాడండి.
25. కవర్లు, ఫోల్డర్లు, క్లిప్పులు మొదలైన వస్తువులని ఒకసారి వాడి పారేయకుండా పదే పదే వాడడానికి ప్రయత్నించండి.

Reference:
Deepika Prasad, Understanding Carbon Footprint, ‘Hasiru Hejje,’ Mysore Amateur Naturalists, Mysore.

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Total Pageviews

There was an error in this gadget
There was an error in this gadget

విజ్ఞానులు

GuestBooker 2.5

Recent Posts

Popular Posts

Follow by Email