శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

మనం పోతున్నది పైకా కిందకా?

Posted by V Srinivasa Chakravarthy Saturday, July 28, 2012
ఆఫ్రికా నడిబొడ్డులోనో, నవ్య ప్రపంచంలోనో (అమెరికా ఖండాలు) ప్రయాణించే యాత్రికులు, రాత్రి వేళ్లల విశ్రమించేటప్పుడు ఒకరికొకరు కాపలా కాస్తారని అంటారు. కాని మేం అలాంటి జాగ్రత్తలేవీ తీసుకోలేవు. జీవ ఛాయలే లేని ఈ పాతాళ బిలంలో ఇక క్రూర మృగాలకి తావెక్కడిది?


మర్నాడు ఉదయం లేచేసరికి అందరికీ మళ్లీ ఓపిక వచ్చి ఉత్సాహం పెరిగింది. మా యాత్ర మళ్లీ కొనసాగించాం. లావా ప్రవహించిన మార్గానే మళ్లీ ముందుకి సాగిపోయాం. మా చుట్టూ కనిపించే రాళ్ల జాతులని పోల్చుకోవడం కష్టంగా వుంది. మేం నడిచే సొరంగ మార్గం కిందికి జారకుండా నేలకి సమాంతరంగా పోతోంది. నిజం చెప్పాలంటే కొద్దిగా పైకి పోతున్నట్టు కూడా కనిపించింది. కాసేపు అయ్యాక వాలు పైకి వుందన్న విషయం నిస్సందేహం అయ్యింది. అలసట వల్ల నడక నెమ్మదించింది.

“ఏవయ్యింది ఏక్సెల్?” ప్రొఫెసర్ మామయ్య వెనక్కి తిరిగి అసహనంగా అడిగాడు.

“ఇక నా వల్ల కాదు మామయ్యా!” రొప్పుతూ జవాబు చెప్పాను.

“అదేంటి. ఇంత సులభమైన దారిలో మూడు గంటల నడకకే?”

“దారి సులభమే కావచ్చు. కాని చెడ్డ ఆయాసం వస్తోంది.”

“ఇందులో ఆయాసపడడానికి ఏవుంది? హాయిగా కిందకి నడవడమేగా?”

“కిందకి కాదు, పైకి.”

“పైకా?” ‘నీకేవైనా మతి పోయిందా?’ అన్నట్టు వుందా ప్రశ్న.

“సందేహమే లేదు. గత అరగంటలో వాలు పూర్తిగా మారిపోయింది. ఈ లెక్కన ఇంకాసేపట్లో ఐస్లాండ్ ఉపరితలాన్ని చేరుకుంటాం.”

నమ్మకం లేకపోయినా ఒప్పుకోక తప్పదన్నట్టు మామయ్య నెమ్మదిగా తల ఊపాడు. నేను సంభాషణ కొనసాగించడానికి ప్రయత్నించాను. ఆయన మరు మాట్లాడకుండా నడవమని సంజ్ఞ చేసి ముందుకి కదిలాడు. అలాంటి సమయంలో ఆయన మౌనం ఒకరమైన వికృత హాస్యంలా అనిపించింది.



ఇక చేసేది లేక నా భారం భుజానికి ఎత్తుకుని ముందుకు కదిలాను. ముందు మామయ్య, మధ్యలో హన్స్, చివరిగా నేను. వెనకబడిపోతానేమో నని వేగంగా అడుగులు వేశాను. ఈ పాతాళపు సొరంగ జాలంలో తప్పిపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది.

మేం నడుస్తున్న దారి వాలు పైకి వుంటే లోలోన సంతోషించేవాణ్ణి. తిరిగి ఉపరితలానికి చేరుకుంటామని ఓ ఆశ. మళ్లీ నా బంగారు గ్రౌబెన్ ని తిరిగి కలుసుకుంటానన్న ఆలోచనకి ఈ సారి ఒళ్లు పులకరించింది.

మధ్యాహ్నాని కల్లా మేం నడుస్తున్న సొరంగం గోడల లక్షణంలో ఏదో తేడా కనిపించింది. గోడల మీద పడి ప్రతిబింబించే కాంతి క్షీణిస్తున్నట్టు అనిపించింది. లావా పై పూత పోయి కఠిన శిల ప్రస్ఫుటం అవుతోంది. గోడలలో శిలా పదార్థపు స్తరాలు కొన్ని చోట్ల నిలువుగాను, మరి కొన్ని చోట్ల వాలుగాను ఉన్నాయి. సిలూరియన్ శిలావ్యవస్థలో (*) సంక్రమణ దశలో ఉన్న రాళ్లని చూస్తున్నాం అని అర్థమయ్యింది.

(* ఓ సువిస్తారమైన శిలాజ జాతికి చెందిన స్తర శ్రేణికి సర్ రోడెరిక్ ముర్చిసన్ (Sir Roderick Murchison) ఇచ్చిన పేరు ఇది. అడుగున ఉన్న అశిలాజ జాతికి చెందిన slatychist శిలకి, పైనున్న ఎర్రని sandstone జాతి శిలకి మధ్యన ఉన్న స్తరాలివి. ష్రాప్ షైర్ సమీప ప్రాంతాలలో ఈ శిలావ్యవస్థ బాగా రూపొందింది. ఈ ప్రాంతాన్ని వెనకటికి సైల్యూర్ జాతికి చెందిన కరాక్టకస్ అనే రాజు పాలించేవాడు. అందుకే ఈ ప్రాంతానికి, ఇక్కడి శిలా వ్యవస్థకి ఆ పేరు వచ్చింది. – ఆంగ్ల అనువాదకుడు)


(నార్వేలో ఒక చోట సిలూరియన్ శిలా వ్యవస్థ - వికీ)

“అర్థమైపోయింది!” ఉత్సాహంగా అరిచాను. “ఇవన్నీ రెండవ కాలంలో ఏర్పడ్డ సాగర అవక్షేపాలే. ఈ షేల్, లైమ్ స్టోన్, సాండ్ స్టోన్ మొదలైనవి అన్నీ అలా ఏర్పడ్డవే. ప్రాథమిక గ్రానైట్ శిల నుండి దూరం అవుతున్నాం. హాంబుర్గ్ నుండి హానోవర్ మీదుగా లుబెక్ కి వెళ్లడం లాంటిదే ఇదీను.”

నా ఈ లోతైన పరిశీలనలన్నీ నాలోనే అట్టేబెట్టేసుకుంటే బావుండేదేమో. కాని భౌగోళిక శాస్త్రం పట్ల నా అభిమానం నా వివేకాన్ని అణిచేసింది. నా మాటలకి మామయ్య స్పందించాడు.

(ఇంకా వుంది)

1 Responses to మనం పోతున్నది పైకా కిందకా?

  1. silu Says:
  2. You will get daily all GK topics&science topics if you are student or teacher or educated people join this group and improve your knowledge. Type JOIN giriseva to 567678(free)

    Do you want GK Bits daily(free) ? just sms JOIN giriseva to 567678 (useful for group2,group4,dsc,police,si)

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts